యువ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో విజయ్ కుమార్ కొండ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమాను కె.కె రాధామోహన్ డైరెక్ట్ చేశారు. మాళవిక నాయర్, హెబ్భా పటేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లు మూతపడటం వల్ల ఓటిటి రిలీజ్ అయిన ఈ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :

ఒకే ఊరికి చెందిన బుజ్జి (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్) వేరు వేరు కారణాల వల్ల ఊరు వదిలి హైదరాబాద్ రావాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి టైంలో ఇద్దరికి పరిచయం అవుతుంది. అయితే ఒకే ఊరికి చెందిన ఇద్దరు ఒకేసారి ఊరి వదిలి వెళ్లడం వల్ల ఊళ్ళో వారికి ఇద్దరు కలిసి లేచిపోయారన్న టాక్ వస్తుంది. అలా బుజ్జి, కృష్ణవేణిల ఫ్యామిలీల మధ్య గొడవలు అవుతాయి. ఈ క్రమంలో బుజ్జి శ్రీనుగా, కృష్ణవేణు స్వాతి గా పరిచయం అవుతారు. అసలైతే సృజన మీద ప్రేమతో ఆమెను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన బుజ్జి మనసు మార్చుకుని స్వాతి అలియాస్ కృష్ణవేణిని ఇష్టపడతాడు. ఓ పక్క బుజ్జి వల్ల తన పరువు పోయిందని స్వాతి అలియాస్ కృష్ణవేని అతని మీద కోపంగా ఉంటుంది. ఇలాంటి టైం లో ఈ కథలు ఎలా ముగింపు పడ్డది అన్నది సినిమా.  

విశ్లేషణ :

ఒరేయ్ బుజ్జిగా కథ మరీ అంత కొత్తగా లేకపోయినా సరే ఎంచుకున్న కథను ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. రాజ్ తరుణ్ లోని కామెడీ సెన్స్ ను బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. కన్ ఫ్యూజ్ కామెడీలో ఎక్కడ క్లారిటీ మిస్సైనా సినిమా తేడా కొట్టేస్తుంది. అలాంటిది విజయ్ కుమార్ అన్ని సందర్భాల్లో తన టాలెంట్ చూపించాడు.

కథ పెద్దగా లేకున్నా కథనం జస్ట్ ఓకే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేదని చెప్పొచ్చు.  సినిమాలో కొన్ని సీన్స్ లో కామెడీతో ఆడియెన్స్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. లీడ్ కాస్ట్ ను బాగా వాడుకున్నాడు డైరక్టర్. సినిమా మొదలైన దగ్గర నుండి ముగింపు వరకు ఎంటర్టైన్మెంట్ ప్రధాన లక్ష్యంగా చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.

నటీనటుల ప్రతిభ :

రాజ్ తరుణ్ బుజ్జి పాత్రలో ఈజ్ గా నటించాడు. ఇలాంటి పాత్రల్లో చేయడం అతనికి కొట్టిన పిండి అనిపించేలా చేశాడు. మాళవిక నాయర్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక హెబ్భా పటేల్ కూడా కనిపించినంతసేపు ఆకట్టుకుంది. నరేష్, పోసాని, వాణి విశ్వనాథ్ అందరు తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉందిల్. డైరక్టర్ విజయ్ కుమార్ కొండ కథ రొటీన్ గా అనిపించినా స్క్రీన్ ప్లే కొద్దిగా నవ్వించాడు. అయితే ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

కామెడీ

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

ఆకట్టుకోని కొన్ని సీన్స్

బాటం లైన్ :

ఒరేయ్ బుజ్జిగా.. జస్ట్ ఫర్ ఫన్ అతే..!

రేటింగ్ : 2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: