సాధారణంగా ఏ దర్శకుడు అయినా సరే, ఒక పెద్ద హిట్ కొట్టాడంటే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ డైరెక్టర్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. వెంటనే ఆయన కాల్ షీట్లు బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ ఆక్యుపై చేస్తారు. ఇలాంటి ఉదాహరణలు మనం గతంలో ఎన్నోసార్లు చూసాం. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకే ప్రాధాన్యం ఇస్తున్నారు జనాలు.  కథ విషయానికి వస్తే పెద్దగా బలంగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ మేనరిజం మాత్రం సినిమా మొత్తాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. నిజంగా చెప్పాలంటే, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని తప్పకుండా చూడదగ్గ సినిమా ఇది. థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్న ప్రతీ అభిమాని తన గుండెల్లో గర్వంగా ఫీల్ అయ్యేలా నటించాడు పవన్ కళ్యాణ్. అంత చక్కగా ఆయన తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను మాంత్రికంగా మార్చేశాడు అని సినీ ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మరొకటి దర్శకుడు సుజిత్ చేసిన స్టైలిష్ ప్రెజెంటేషన్. వీటన్నింటికీ తోడు పవన్ కళ్యాణ్ మేనరిజం, యాక్షన్, డైలాగ్ డెలివరీ సినిమాను హై రేంజ్‌లో ఎలివేట్ చేశాయి. దీంతో సుజిత్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే, సుజిత్ తన తదుపరి సినిమాను ఎవరి తో చేయబోతున్నాడు అన్నది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల ప్రకారం, సుజిత్ తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో ఫిక్స్ అయ్యాడని సమాచారం. పవన్ కళ్యాణ్ తో సినిమా షూట్‌లో రామ్ చరణ్ ఒక రోజు సెట్‌కి వెళ్లినప్పుడు, అక్కడ సుజిత్ డైరెక్షన్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడట. అదే సమయంలో సుజిత్ ఒక రెండు లైన్ల స్టోరీని చరణ్‌కి వినిపించాడని, ఆ కాన్సెప్ట్ కొత్తగా అనిపించి రామ్ చరణ్ వెంటనే ఓకే చేశాడని టాక్. "ఓజీ" సినిమా పూర్తయిన తర్వాత కలుద్దాం అంటూ మాటిచ్చాడట రామ్ చరణ్.



ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో పెద్ద ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు. వీటి తర్వాతే సుజిత్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల రామ్ చరణ్సుజిత్ కాంబినేషన్ మూవీ కొంచెం టైమ్ తీసుకోవచ్చు కానీ, ఈ వార్త ఒక్కసారిగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద హంగామా జరుగుతోంది.ఇక చూడాలి మరి, ఈ మెగా సెంటిమెంట్ సుజిత్ కెరీర్‌ను ఇంకెంత ఎత్తుకు తీసుకెళ్తుందో. పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ లాంటి స్టార్‌తో పనిచేయడం అంటే నిజంగానే ఒక దర్శకుడి కెరీర్‌లో గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: