
మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు అస్సలు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.. అయితే అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది.తాజాగా అమ్మాయిలు బికినీ వేసుకుంటే ట్రోల్ చేస్తారు.. అబ్బాయిలు విప్పుకుని తిరిగితే ఎందుకు కామెంట్ చేయరు` అని మండి పడుతోంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. హీరోయిన్లు బికినీ వేయడంపై ఆ మధ్య కామెంట్స్ రావడం, తనని కూడా ట్రోల్స్ చేసిన నేపథ్యంలో తాప్సీ ఫైర్ అయ్యింది.
సినీ పరిశ్రమలోని లూప్స్ పై కూడా స్పందిస్తూ తన బాధ్యతని, తన బోల్డ్ నెస్‌ని చాటుకుంటుంది. హీరోయిన్లు బికినీ ఫొటోలు షేర్ చేయడంపై నెట్టింట్లో ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది.ఇలా జరగడంపై ఢిల్లీ భామ తాప్సీ పన్ను స్పందించింది. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బికినీ ఫొటోలపై జరిగే ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడారు.`నాకు తెలిసి జనరల్‌గా అమ్మాయిలు బికినీ ఫొటోలు షేర్ చేస్తే తప్పుబడుతూ ట్రోలింగ్ చేస్తారు. వల్గర్ కామెంట్లు చేస్తుంటారు. కానీ అబ్బాయిల విషయంలో ఇది జరగదు. వాళ్లు జిమ్‌లోనో, బీచ్‌లోనో సగం దుస్తులే ధరించిన ఫొటోలు షేర్ చేస్తుంటారు. దుస్తులు విప్పుకునే పోజులిస్తుంటారు. కానీ ఎవరూ వారిపై ఎలాంటి కామెంట్ చేయరు. సమాజంలో ఆడ, మగ అనే సమానత్వం లేదనే దానికి, మహిళను చిన్నచూపు చూస్తారనేదానికది నిదర్శనం` అని తాప్సీ చెప్పింది.