తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు అనే సినిమాతో ఒక యువ హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి అనే ఒక బోల్డ్ కంటెంట్ సినిమాలో నటించాడు.. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు అని చెప్పాలి.


 అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ కంటెంట్ సినిమా తర్వాత గీత గోవిందం అనే సినిమాలో డీసెంట్ కుర్రాడిగా నటించి అందరిని ఆశ్చర్యపరిచాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ కెరియర్ కీలక మలుపు తిరిగింది. అయితే విజయ్ దేవరకొండ కేవలం సినిమాలతోనే కాదు తన ఆటిట్యూడ్తో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కి కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు అటు సినీ సెలబ్రిటీలు సైతం అభిమానులు ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్లు విజయ్ దేవరకొండ తో నటించాలని కోరుకుంటూ ఉంటారు.


 ఇప్పుడు తనకు కూడా విజయ్ దేవరకొండ తో కలిసి నటించాలని ఉంది అంటూ బాలీవుడ్ స్టార్ కిడ్, హీరోయిన్ సారా అలీ ఖాన్ చెప్పింది. ప్రస్తుతం  'అత్రాంగి రే' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో సౌత్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్తో కలిసి నడుస్తుండగా.. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సారా అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిలో ఏ హీరోతో నటించాలని ఉంది అని అడగగా. విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు విజయ్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఓకే చెప్తాను.. అతను గొప్ప అందగాడు అంటూ సమాధానం చెప్పుకొచ్చింది సారా ఆలీ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: