బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యంగా ఈయన కి గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పొచ్చు. కార్తీక్ ఆర్యన్ ను లేడీ ఫాన్స్ తెగ ఇష్టపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు గతంలో కొంతమంది అమ్మాయిలు ఆర్యన్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇంటికి వెళ్లి ఆయన కోసం వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఆర్యన్ ఎక్కడికైనా వెళుతున్నాడు అంటే చాలు అక్కడ అక్కడ ముందుగా ఉండేది అమ్మాయిలే. ఇక ఇదిలా ఉంటే తాజాగా కార్తీక్ కూడా సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నాడు.

ఇటీవల ఆర్యన్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోకు లేడీ నెటిజన్లు అనేకమైన కామెంట్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆర్యన్ ను ఒక లేడీ నెటిజన్ అయితే ఏకంగా నేను 20 కోట్లు ఇస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేసింది. అయితే అసలు విషయం ఏమిటంటే దీనికి ఆర్యన్ కూడా రిప్లై ఇవ్వడం జరిగిందట. సరే ఎప్పుడు చేసుకుందాం అని ఆర్యన్ చెప్పా డు. దీనికి ఆ  నెటిజన్ ఇప్పుడే చేసుకుందాం వచ్చేయ్ అని రిప్లై ఇచ్చింది ఇక దీని అనంతరం వారి చాటింగ్ కొద్దిసేపు నడిచింది..అయితే  ఇది చూసిన మరికొందరు అమ్మాయిలు కూడా మేము కూడా డబ్బులు ఇస్తాము మమ్మల్ని కూడా పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక దీంతో కార్తీక్‌ ఆర్యన్‌ సరదాగా వేలంపాట వేద్దామా అని కామెంట్ పెట్టాడు. అంతే కాదు గతంలో కూడా ఒకసారి ఒక అమ్మాయి నా కామెంట్ కి రిప్లై ఇస్తే నీకు పది లక్షలు ఇస్తా అంటూ కామెంట్ పెట్టిందట ఇక దానికి ఆర్యన్ సరే 10 లక్షలు పంపు అని రిప్లై ఇవ్వడం కూడా జరిగిందట.ఇలా ఆర్యన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ లేడీ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఇటీవల ధమాకా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కార్తిక్ ఆర్యన్.. ప్రస్తుతం తెలుగులో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా గెలిచిన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం లో' సినిమా హిందీ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: