ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా మ్యానియా నడుస్తోంది. టాలీవుడ్ దర్శక దిగ్గజం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా పాత రికార్డులను ఒక్కోటిగా చెరిపేసుకుంటూ పోతూ కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది.ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన పన్నెండు రోజులకే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్(858 కోట్లు)' సినిమాని వెనక్కి నెట్టి రూ.955 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10  ఇండియన్ సినిమాలలో మూడో స్థానంలో నిలిచింది. ఇక అన్ని సినిమాల కంటే కలెక్షన్ల పరంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా 1924 కోట్లతో, టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 1749 కోట్లతో ఈ సినిమా కంటే ముందు టాప్ 2 ప్లేస్ లలో నిలిచాయి.అయితే.. ఆ రెండు సినిమాలలాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇంకా చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో అయితే విడుదల కాలేదు. కానీ.. ఆ దేశాల్లో కూడా బాహుబలి 2 సినిమా వల్ల రాజమౌళికి మంచి మార్కెట్ ఏర్పడింది.కాబట్టి అక్కడ కూడా విడుదలైతే ఈ కలెక్షన్స్ ఇంకా బాగా పెరుగుతాయి. కానీ.. అక్కడి కలెక్షన్ల పరంగా ఈ సినిమాలకి ఏ మాత్రం పోటీ ఇస్తుందో అనేది మున్ముందు చూడాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైమ్ టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్ ఏంటో చూసేద్దామా! 



అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన టాప్ 10 ఇండియన్ మూవీస్


1. దంగల్ - రూ.1924.70  కోట్లు (గ్రాస్)
2. బాహుబలి: ది కన్‌క్లూజన్ (బాహుబలి2) - రూ. 1749 కోట్లు(గ్రాస్)
3. ఆర్ ఆర్ ఆర్ - రూ.955.3కోట్లు (12 రోజులు)(గ్రాస్)
4. భజరంగీ భాయిజాన్ - రూ. 902.80 కోట్లు(గ్రాస్)
5. సీక్రెట్ సూపర్ స్టార్ - రూ.830.80 కోట్లు(గ్రాస్)
6. పీకే - రూ. 742.3 కోట్లు(గ్రాస్)
7. 2.0 (రోబో 2)- రూ. 654.40 కోట్లు(గ్రాస్)
8. సుల్తాన్ - రూ. 614.90 కోట్లు(గ్రాస్)
9. బాహుబలి: ది బిగినింగ్ ( బాహుబలి1)- రూ.600.60 కోట్లు(గ్రాస్)
10. సంజు - రూ. 580.10 కోట్లు(గ్రాస్)

మరింత సమాచారం తెలుసుకోండి: