
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు సమీపంలో సరోరా బస్తీ ఉంది. ఆ బస్తీలో ఉమేష్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఉమేష్ కుమార్‌కు అప్పటికే ఇద్దరు మహిళలతో వివాహం జరగడంతోపాటు విడాకులు కూడా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంగ్లేశ్వరి అనే మహిళతో మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఆ బస్తీలోనే జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉమేష్‌కు కొద్ది రోజుల కిందట మరో మహిళ పరిచయం కావడం.. ఆమెతో కూడా ప్రేమలో పడటం జరిగింది.
దీంతో ఉమేష్ ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఉమేష్ మరో మహిళతో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం ఇంగ్లేశ్వరికి తెలిసింది. మరోసారి పెళ్లి చేసుకోవద్దని చాలా సార్లు చెప్పింది. అయినా ఉమేష్ మాట వినలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ పెరిగింది. కోపోధ్రిక్తురాలైన ఇంగ్లేశ్వరీ ఒక పెద్ద బండరాయి తీసుకుని ఉమేష్ తలపై కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై ఉమేష్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ప్రభుత్వ మార్చరీకి తరలించారు. ఈ మేరకు భార్య ఇంగ్లేశ్వరిని విచారణ జరుపగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.