లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో విడుదల తేదీకి ఎన్నో రోజులు లేకపోవడం ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహించడానికి కారణం అవుతుంది. ఇప్పటికే నార్త్ లో పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సౌత్ లో భారీ ప్రమోషన్ కార్యక్రమాలను చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే వరంగల్ , హైదరాబాదు లాంటి ప్రదేశాలలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏపీలోని గుంటూరులో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 20వ తారీకు ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఆ తరువాత ఆయన మరిన్ని ప్రదేశాలలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కగా ఈ చిత్రంలో మైక్ టైసన్ అతిధి పాత్ర లో నటిస్తూ ఉండడం విశేషం. అనన్య పాండే హీరో యిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తూ ఉండడం విశేషం. రెండు సంవత్సరాలుగా ఏకతాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలవ్వడం నిజం గా మంచి పరిణామం అనే చెప్పాలి. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపద్యంలో పెద్ద సినిమాలు ప్రేక్ష కుల ముందుకు వచ్చేందుకు ఆలోచిస్తున్నాయి. అందుకే ఇప్పుడు రాబోయే సినిమా భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. థియేటర్ లో చూసే సినిమా ఇంత వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: