
చిరంజీవి మాట్లాడుతూ చిత్రపురి కాలనీలో ఒక ఆసుపత్రిని నిర్మించాలనుకుంటున్నానని అది కూడా తన తండ్రి పేరు మీదుగా ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రి నిర్మాణం కోసం ఖర్చు ఎంతైనా సరే వెనుకాడనని తెలియజేశారు అంతేకాకుండా తాను చేసే పనులకు పెద్దగా ప్రచారం అవసరం లేదని కూడా తెలిపారు.. అయితే సమాచారం మాత్రం కచ్చితంగా ఇవ్వాలని అలా జరగడం వల్ల పదిమందికి తెలిసి వాళ్లు కూడా తనని ఇన్స్పైర్ గా చేసుకుని మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారని చిరంజీవి అభిప్రాయంగా తెలియజేశారు.
సినీ సెలెబ్రెటీలు అంతా ఒక మంచి కాజు కోసం ఈ క్రికెట్ ఆడుతున్నామని తెలిపారు సుధీర్ బాబు ఈసారి చిత్రపురి కాలనీ కోసం ఒక 20 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానని తెలియజేశారు ఇక తరుణ్ కూడా ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ తదితరులు కూడా మాట్లాడడం జరిగింది కరోనా సమయంలో చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అది గమనించిన తాము ఈసారి డల్హౌస్ ట్రోఫీ ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు ఇవ్వాలనుకున్నానని తెలిపారు. చిత్రపురి ఆసుపత్రి కోసం తనవంతుగా మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహిస్తానని శ్రీకాంత్ తెలిపారు. చిరంజీవి ఇలాంటి నిర్ణయంతో మరొకసారి పాపులర్ అయ్యారు.