తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన ఆర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తడకెక్కిన వరుడు మూవీ లో ఆర్య ప్రతినాయకుడి పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే ఇతర భాషలలో ఆర్య నటించిన మూవీ లు కూడా తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఆర్య 'సర్పట్టా పరంపర' అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. సర్పట్టా పరంపర మూవీ తో ఆర్య ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్య 'కెప్టెన్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల అయ్యింది.  ఈ మూవీ కి శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆర్య హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కెప్టెన్ మూవీ 'ఓ టి టి' హక్కులను జీ 5 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: