ఓవర్ నైట్ స్టార్ డమ్ రావడంతో విజయ్ దేవరకొండ పైకి చూశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో చూపించిన యాటిట్యూడ్ బయట కూడా చూపించడం మొదలుపెట్టాడు అంట మరి

అది ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. చాలా తక్కువ సమయంలో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా వచ్చింది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఎక్కడికో వెళ్ళిపోయాడు విజయ్ దేవరకొండ . దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న నాని, శర్వానంద్, రామ్ వంటి హీరోలను దాటేసి ముందుకు వెళ్ళిపోయాడు. సక్సెస్, నేమ్, ఫేమ్ వచ్చినప్పుడు అణకువగా ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకంటే ఏమాత్రం నోరు జారినా అది న్యూస్ అవుతుంది. పొగరు తలకెక్కిందనే విమర్శలు బాగా వెల్లువెత్తుతాయి.

విజయ్ దేవరకొండకు లేనిది అదే. రౌడీ హీరో, యాటిట్యూడ్ స్టార్ అంటూ పేరుగాంచిన విజయ్ వేదికలపై చేసిన కామెంట్స్, బిహేవియర్ పలుమార్లు వివాదాస్పదమైంది. ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా ఆఫర్స్ రావడంతో మనోడు  ఇంకా మారలేదు. అదే పొగరు కొనసాగించారు. ఏళ్లుగా ఆయన చూపించిన యాటిట్యూడ్ కి లైగర్ ఫెయిల్యూర్ రూపంలో భారీ మూల్యం చెల్లించాడు గా మరి . కంటెంట్ తో పాటు విజయ్ దేవరకొండ వైలెంట్ బిహేవియర్ కూడా లైగర్ డిజాస్టర్ కి కారణమైందన్న మాట వినిపించింది.

ముంబైకి చెందిన ఒక థియేటర్ ఓనర్ ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశాడు. విజయ్ దేవరకొండను బండ బూతులు తిట్టాడు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లైగర్ మూవీ ఓపెనింగ్స్ భారీగా దెబ్బతీసిందని అన్నాడు. లైగర్ మూవీతో మొత్తంగా తాను మునిగిపోయానని ఆవేదన చెందాడు. లైగర్ ఫెయిల్యూర్ విజయ్ దేవరకొండ కెరీర్ ని బాగా డ్యామేజ్ చేసింది. దాదాపు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ జనగణమన ఆగిపోయింది. లైగర్ రెమ్యూనరేషన్ తో పాటు కొత్త ప్రాజెక్ట్ కోల్పోయాడు.

వీటన్నింటికీ మించి దారుణమైన సోషల్ మీడియా  బాగా ట్రోల్స్ కి గురయ్యాడు. ఈ మాత్రం సినిమాకేనా అంత బిల్డప్ కొట్టావు అంటూ ఏకిపారేశారు. ఈ పరిణామాలతో విజయ్ దేవరకొండ కృంగిపోయాడట. తప్పు చేశాననే పశ్చాతాపం ఆయన్ని వెంటాడుతోందట. గతంలో ఉన్న ఎనర్జీ, చురుకుతనం విజయ్ దేవరకొండలో ప్రస్తుతం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. లైగర్ ఇచ్చిన షాక్ తో విజయ్ లో మార్పు వచ్చిందని ఇకపై ఆయన యాటిట్యూడ్ చూపించకపోవచ్చు అంటున్నారు. రష్మికతో మాల్దీవ్స్ టూర్ కూడా డిప్రెషన్ నుండి బయటపడేందుకే  అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: