అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా యొక్క రెండవ భాగం షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా యొక్క అగ్ర భాగం షూటింగ్ మొత్తం బ్యాంకాక్ లోనే జరుగుతుంది అని చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఈ సినిమాను అంతకు మించిన స్థాయిలో చేయాలి అని అందరూ భావించారు.

 అందుకే ఈ సినిమా యొక్క ఫ్రీ ప్రొడక్షన్ పనులకు ఇంతటి సమయాన్ని తీసుకున్నారు. పెరిగిన అంచనాల దృష్ట్యా ఈ సినిమా యొక్క కథను పూర్తిగా మార్చి వేశారని తెలుస్తుంది. అందుకే లొకేషన్లను కూడా పూర్తిగా మార్చి వేశారట. అందులో భాగంగానే బ్యాంకాక్ లో ఈ సినిమా యొక్క షూటింగ్ చేయబోతున్నారని అంటున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెండో భాగం ఏ స్థాయిలో ప్రేక్షకులను అందిస్తుందో చూడాలి. ఇందులో ఒక మెయిన్ విలన్ గా బాలీవుడ్ నటుడుని కూడా తీసుకోబోతున్నారని అంటున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తూ ఉండడం విశేషం.

ఏదేమైనా అల్లు అర్జున్ ఇలాంటి సినిమాను చేయడం ఆయనకు నార్త్ లో ఇంతటిస్థాయి క్రేజ్ రావడానికి కారణం అని చెప్పాలి. పుష్ప సినిమా విడుదలైన కొత్తలో ఈ చిత్రానికి ఎంతటి స్థాయిలో అక్కడ ఆదరణ దక్కిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా అల్లు అర్జున్ ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవాలి అంటే ఈ రెండవ భాగం సినిమాతో కూడా అలాంటి విజయాన్ని అందుకోవాల్సిందే. ఇక సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమాల విషయానికొస్తే అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పాలి. ఇప్పుడు పుష్పా రెండో భాగం సినిమా వారి కాంబినేషన్లో రాబోతున్న ఐదవ సినిమా కావడం విశేషం. తొందరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతున్న అనే పద్యంలో ఈ చిత్రాన్ని ఏ విధంగా చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: