‘యశోద’ సినిమా ప్రమోషన్ చేస్తూ సమంత తనకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి చాలచాల మాట్లాడింది. ఆమె పై కేవలం ఆమె అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు సినిమాను ప్రేమించే అందరు సమంత తిరిగి కోలుకోవాలని ఆమె మళ్ళీ తన నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని తిరిగి పొందాలని అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం సమంత ఆరోగ్య విషయంలో ఏమి జరుగుతోంది అన్న విషయం పై క్లారిటీ లేకపోవడంతో ఆవిషయం పై రకరకాల గాసిప్పులు ఇప్పటికీ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ మీడియాలో వస్తున్న గాసిప్పులు చూసి సమంత అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఈ గాసిప్పులను సమంత పిఆర్ సిబ్బంది ఖండించినప్పటికీ తిరిగి ఆమె మళ్ళీ ఎప్పటిలానే యాక్టివ్ గా కనిపిస్తుంది అన్న విషయం పై ఆమెతో సినిమాలు తీస్తున్న వారికి కూడ క్లారిటీ లేదు అని అంటున్నారు.


విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ ఆమె కోసం ఎదురు చూస్తోంది. ఇక ‘శాకుంతలం’ మూవీలోని కొన్ని సీన్స్ కు సంబంధించి ప్యాచ్ వర్క్ జరగవలసి ఉంది అని అంటున్నారు. ఈ రెండు కాకుండా వరుణ్ ధావన్ తో ఆమె చేయవలసిన వెబ్ సిరీస్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. ‘Arrangements of Love’ అన్నపేరుతో ఇండియాలో తీయబోతున్న ఒక హాలీవుడ్ మూవీలో సమంత ఒక కీలక పాత్రలో నటించడానికి ఇప్పటికే ఆ ఎగ్రిమెంట్ పై సంతకం చేసింది అని అంటారు.


అయితే ఇప్పుడు ఆ మూవీ ప్రాజెక్ట్ ఉందా లేదా అన్న విషయం పై కూడ క్లారిటీ లేదు. మరొకవైపు రష్మిక పూజా హెగ్డే ల మ్యానియా రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో సమంత త్వరగా తన అనారోగ్య సమస్యల నుండి కోలుకుని తిరిగి షూటింగ్ ల వైపు రాకుంటే ఆమె కెరియర్ కు చాలనష్టం జరిగే ఆస్కారం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: