నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే. ఒకటి ఫ్యాక్షనిస్ట్ గా నటించగా ఇంకొకటి అఘోర గా నటించి అందరిని మెప్పించాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అంతకు మించి అన్నట్లుగా త్వరలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న వీర సింహారెడ్డి లో పాత్రలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఇది బాలయ్య అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయం అని చెప్పాలి.

వీర సింహారెడ్డి సినిమా లో మూడు విభిన్నమైన గెటప్స్ లో బాలయ్య కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే అయన ఈ సినిమా లో రెండు పాత్ర లు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయమై క్లారిటీ వచ్చింది. రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ను రివీల్ చేశారు. అయితే ఈ సినిమా లోని ఇంకో గెటప్ పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  మరో గెటప్ విషయంలో మేకర్స్ సస్పెన్స్ లో ఉంచడం జరిగిందని తెలుస్తుంది.

బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ఆయన ఫ్యాన్స్ కు కచ్చితంగా సంక్రాంతి పండుగను డబుల్ చేస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూడో గెటప్ తప్పకుండా మంచి కిక్ ని బాలయ్య అభిమానులకు అందజేస్తుంది.  అఖండ సినిమాను మించిన విజయాన్ని వీరసింహారెడ్డి సినిమా దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మరి సంక్రాంతి మరికొన్ని సినిమాలు కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా బాలయ్య కు ఏ స్థాయి లో విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తం తో నిర్మించారు. ఏదేమైనా ఈ సినిమా సంక్రాంతి కి విడుదల అవడం బాలయ్య అభిమానులను సంతోశాపరుస్తుంది. ఆ సమయంలో చిరంజీవి కూడా తన సినిమా తో రాబోతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: