మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో అను ఇమ్మాన్యూయల్ , మేఘ ఆకాష్ , పూజిత పొన్నోడా , పరీయ అబ్దుల్లా , దాక్షా నాగర్కర్ ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ఇంకో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ రెండు పాటల షూటింగ్ ను కూడా చిత్ర బృందం పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి గ్లిమ్స్ విడుదల తేదిని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ఈ మూవీ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

మరి ఈ మూవీ గ్లిమ్స్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం చివరలో విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ "రావణాసుర" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: