
కేవలం హీరోల సినిమాలలో మాత్రమే కాదు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి అందరినీ భయపెట్టేసిన హన్సిక ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని ఏడడుగులు వేసి కొత్త బంధంలోకి అడుగు పెట్టింది . ఈ సందర్భంగా ఆమె సినిమాలకు దూరం అవుతుంది అంటూ రకరకాల వార్తలు షికారులు అయ్యాయి. హన్సిక సినిమాలకు దూరం కాబోతోంది అని.. పూర్తిగా తన జీవితాన్ని వైవాహిక జీవితానికి అంకితం చేయబోతోంది అంటూ కూడా రూమర్స్ క్రియేట్ చేశారు కొంతమంది రూమర్స్..
అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ గోవా బ్యూటీ హన్సిక.. తాను సినిమాల నుంచి తప్పుకోవడం అనే ఆలోచన తనకు ఇప్పటివరకు రాలేదు అని.. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయను అని స్పష్టత ఇచ్చింది .ప్రస్తుతం ఈమె చేతిలో 6 ప్రాజెక్టులు ఉన్నట్లుగా కూడా ప్రకటించింది. తెలుగు, తమిళతో పాటు మరికొన్ని ఇతర భాష చిత్రాలలో కూడా ఆమె నటిస్తున్నట్లు సమాచారం . మరొకవైపు రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాను అని త్వరలోనే ఈ అన్ని సినిమాలను మీ ముందుకు ఉంచుతానని హన్సిక క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే సినిమాలకు గుడ్ బై చెప్పను అని క్లియర్ గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ