కొంత మంది ముద్దుగుమ్మలకు డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా డబ్బింగ్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీలలో దివ్య భారతి ఒకరు. ఈమె కొంత కాలం క్రితం బ్యాచిలర్ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు దక్కింది.

ఇకపోతే బ్యాచిలర్ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు టాలీవుడ్ కమెడియన్లలో ఒకరు అయినటువంటి సుడిగాలి సుదీర్ హీరో గా ది గొట్ అనే సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయింది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం పూర్తయింది. ఈ సినిమా నుండి ఒక సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ సాంగ్లో దివ్య భారతి తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

దానితో ఈ సినిమా గనుక విడుదల బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మంచి విజయం సాధించిన కూడా అందులో గనుక ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ బ్యూటీసినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమంలో స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదుగుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె నటిస్తున్న ది గోట్ మూవీ కి సంబంధించిన అప్డేట్లు రాక చాలా కాలం అవుతుంది. దానితో ఈ సినిమా విడుదల అవుతుందా ..? లేదా ..? అనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ లేదు. దానితో డబ్బింగ్ సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ బ్యూటీ కి మొదటి తెలుగు సినిమాతోనే కష్టాలు ఎదురయ్యాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

db