తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన హీరోగా కెరియర్ను ప్రారంభించిన తర్వాత అద్భుతమైన విజయాలను అనుకున్నాడు. దానితో ఈయన క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఈయనకు ఆఖరుగా విజయం దక్కి మాత్రం చాలా కాలమే అవుతుంది. ఈయనకు ఆఖరి విజయం టాక్సీవాలా అనే మూవీ ద్వారా దక్కింది. ఈ సినిమా తర్వాత ఈయన అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈయనకు ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. ఆఖరుగా విజయ్ దేవరకొండ "కింగ్డమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధిస్తుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకోలేదు. దానితో విజయ్ కి ఈ మూవీ ద్వారా కూడా నిరాశే మిగిలింది. ఇది ఇలా ఉంటే  విజయ్ కొంత కాలం  క్రితమే రాహుల్ సంకృతీయన్ దర్శకత్వంలో ఓ మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ ను సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ మొదటి వారంలో మొదలు పెట్టే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ దేవరకొండ , రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ హీరో గా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు రౌడీ జనార్దన్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఈ మూవీ ని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన లాంచ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ నుండి ఈ మూవీ షూటింగ్ను మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd