తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న ధనుష్ తాజాగా సార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ కి యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. 

మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ లో వేత్తి అనే పేరుతో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ తెలుగు ... తమిళ భాషలో విడుదల అయిన ఈ మూవీ ఈ రెండు భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థ లలో అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" తగ్గించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ ఈ మూవీ ని మార్చి 17 వ తేదీ నుండి తెలుగు మరియు తమిళ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ నీ కూడా విడుదల చేసింది. మరి థియేటర్ లలో ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: