‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ప్రపంచంలోని ప్రతి తెలుగువాడు అది తనకు లభించిన గౌరవంగా భావించడంతో నిన్న తెలుగు రాష్ట్రాలలో  పండుగ వాతావరణం కనిపించింది. 95 సంవత్సరాల ఆస్కార్ అవార్డ్ ల చరిత్రలో భారతీయులకు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే ఆవిషయాన్ని చాల మీడియా సంస్థలు మర్చిపోయినట్లుగా కనిపించాయి.


గుల్జార్ రెహమాన్ రసూల్ పూకొట్టి లకు గతంలో ఆస్కార్ అవార్డులు వచ్చిన విషయం ఈతరానికి గుర్తులేదా అన్న సందేహం కలుగుతుంది. అయితే కీరవాణి చంద్రబోసులు మన తెలుగువారు కాబట్టి ఆనందపడవలసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈ ఆనందం మితిమీరిన స్థాయిలో ఉందా అన్నసందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.


ఇవన్నీ ఒక ఎతైతే తెలుగు సినిమాను భారీ బడ్జెట్ తో తీసి పాన్ ఇండియా సినిమాగా ఎలా ప్రమోట్ చేయాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మార్గాన్ని చూపించిన రాజమౌళి ఇక రానున్న రోజులలో తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్ ల రేసులో ఎలా నిలబెట్టి విజయం సాధించాలో ఒక మార్గాన్ని రాజమౌళి చూపించాడు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. కేవలం ఒక సినిమాను ఆస్కార్ అవార్డ్ ప్యానల్ కు పంపి ఖాళీగా కూర్చోకుండా సినిమాను అమెరికాకు వెళ్ళి అక్కడ ప్రమోట్ చేసే ప్రయత్నాలలో వందలాది మీటింగ్ లు డే పార్టీలు నైట్ పార్టీలు ప్లానింగ్ లు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేయాలి అన్న మార్గాన్ని ఇండస్ట్రీకి చూపించాడు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.


దీనికోసం ఎంతో ఖర్చు అవసరం అన్నది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ అది ఎంత అన్నది కేవలం రాజమౌళికి మాత్రమే తెలుస్తుంది. అయితే తెలుగు కవులలో ఎవరికీ దక్కని అదృష్టం చంద్రబోసుకు దక్కింది. సిరివెన్నెల మరణం తరువాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించే పాటలు రచయిత ఎవరు అన్న ప్రశ్నకు చంద్రబోసు రూపంలో సమాధానం దొరికింది.ఈ ఆస్కార్ ఇచ్చిన ఉత్సాహంతో రాజమౌళి మహేష్ తో తీయబోయే సినిమాకు ఎన్నివందల కోట్లు ఖర్చుపెడతాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: