టాలీవుడ్ అగ్ర హీరో మాస్ మహారాజా రవితేజ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో 'డాన్ శీను' కూడా ఒకటి. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని వెండితెరకు దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇక సినిమాలో రవితేజ సరసన శ్రియ, అంజన సుఖని హీరోయిన్స్ గా నటించగా.. రియల్ స్టార్ శ్రీహరి, కస్తూరి కీలకపాత్రలో కనిపించారు. 2010 ఆగస్టు 6 తేదీన విడుదలై ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. అంతేకాదు అప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ మూవీ మంచి కం బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. వి సురేష్ రెడ్డి, ఆర్ఆర్ వెంకట్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. 

ఇక ఈ సినిమా హిట్ తర్వాత గోపీచంద్ మలినేని - రవితేజ కాంబినేషన్లో బలుపు, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే డాన్ శీను సినిమాకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందు ఇద్దరు అగ్ర హీరోలు రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత ఈ కథ రవితేజ వద్దకు వెళ్లిందట. ఆ రిజెక్ట్ చేసిన ఇద్దరు అగ్ర హీరోలు మరెవరో కాదు మన పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరైతే.. యాక్షన్ హీరో గోపీచంద్ మరొకరు.. దర్శకుడు గోపీచంద్ మలినేని డాన్ శీను కథను ముందుగా ప్రభాస్ కి వినిపించాడట. కానీ ప్రభాస్ అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేస్తున్నారు. అలాగే డాన్ శీను మూవీ కథ గతంలో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాకు దగ్గరగా ఉండటంతో ప్రభాస్ ఈ సినిమాకి నో చెప్పాడట.

ఇక ఆ తర్వాత గోపీచంద్ కి కథ చెప్పగా అప్పటికే గోపీచంద్ గోలీమార్, వాంటెడ్ సినిమాలు చేస్తుండడంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాకి అతను కూడా నో చెప్పాడట. అలా ఈ ఇద్దరు హీరోలు డాన్ శీను కథకి నో చెప్పడంతో కొన్నాళ్లు గోపీచంద్ మలినేని ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాడట. ఇక ఎక్కువ రోజులు వేచి చూడడం ఇష్టం లేని గోపీచంద్ మలినేని ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారికి కథ చెప్పి ఆ తర్వాత రవితేజకు కథ వినిపించడంతో వెంటనే రవితేజ ఓకే చేశారట. కేవలం 77 రోజుల్లోనే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని థియేటర్స్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. అయితే డాన్ శీను సినిమా ప్రభాస్, గోపీచంద్ వంటి అగ్ర హీరోల దగ్గరికి వెళ్లిన విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: