లవ్ టుడే సినిమాతో ఇవానా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంత వరకు డబ్బింగ్ సినిమాలతో నే ఇవానా ఇక్కడి ప్రేక్షకులనుఅయితే పలకరించింది.

ఝాన్సీ సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించి మెప్పించింది ఇవానా.. లవ్ టుడేలో ఒక్కసారిగా అందరినీ బాగా ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఇవానా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందనీ తెలుస్తుంది.తన మొదటి తెలుగు సినిమా అంటూ తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ కూడా ఇచ్చింది ఇవానా.

దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు ఆశిష్‌ రెండో సినిమాతో ఇవానా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోందనీ తెలుస్తుంది.. ఆశిష్‌ మొదటి సినిమా రౌడీ బాయ్స్‌ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసిన విషయం తెలిసిందే.. కనీసం నటుడిగా ఆశిష్‌కు మినిమం మార్కులు కూడా పడలేదనీ చెప్పాలి.. యాక్షన్, డ్యాన్స్ ఇలా ఎందులోనూ ఆశిష్ ఆడియన్స్ మెప్పించలేకపోయాడు. అనుపమ పరమేశ్వరన్‌కు లిప్ లాక్స్ పెట్టడంతో ఆశిష్ బాగా వైరల్ అయ్యాడు.

ఇక ఇప్పుడు ఇవానాతో రొమాన్స్ చేసి ఫేమస్ అయ్యేలా ఉన్నాడట ఆశిష్‌. సెల్ఫిష్ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఇవానా, ఆశిష్‌లు కనిపిస్తున్నారు. ఇక ఇవానా అయితే చిరాగ్గా ఫేస్ పెట్టినట్టు కూడా అనిపిస్తోంది. మరి అలా మూడీగా ఉండటానికి కారణం ఏంటన్నది సినిమా చూస్తే నే అర్థం అవుతుంది.

దిల్ రాజు అయితే తన ఇంటి నుంచి వచ్చిన వారసుడ్ని నిలబెట్టేందుకు బాగా ప్రయత్నిస్తున్నాడు. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దిల్ రాజు.. తన ఇంటి వారసుడికి మాత్రం మంచి డెబ్యూని అయితే ఇప్పించలేకపోయాడు. మరి ఇప్పుడు ఈ రెండో సినిమాతోనైనా దిల్ రాజు తమ వారసుడు ఆశిష్‌ని నిలబెడతాడా? లేదా? అన్నది అయితే  చూడాలి. తన పోరిని రిజ్వర్ చేసిన అంటూ ఈ సినిమాలో చైత్ర అనే పాత్రలో ఇవానా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: