టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే అఖిల్ నటించిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అఖిల్ నటించిన సినిమాలలో రెండు సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. నిర్మాతలకు కూడా భారీ రేంజ్ లో నష్టాలు వచ్చాయి. ఆ మూవీ లు ఏవో తెలుసుకుందాం.

అఖిల్ టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా విడుదల అయ్యాక నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమాకు దాదాపుగా 26 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

అఖిల్ తాజాగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ... సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. సాక్షా వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనిల్ సుంకర నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి భారీ బిజినెస్ జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి 30 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: