ఏ స్టార్ హీరో హీరోయిన్ లకి అయినా సరే మీడియా మీటిలో ఒక్కోసారి ఊహించని ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు హీరో హీరోయిన్ల విషయంలో మీడియా చాలా ఉదారంగా ఉండేవారు. వాళ్ళని చిన్నపాటి ఇబ్బంది కూడా పెట్టేవారు కాదు. దానికి తగ్గట్లుగా అన్ని ప్రిపరేషన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. తెలుగు మీడియా కూడా హిందీ మీడియా లాగా మారిపోయింది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నా ప్రశ్నలకు హీరో హీరోయిన్స్ సమాధానం చెప్పలేకపోతున్నారు. సమాధానాలు లేని ప్రశ్నలను అడిగి హీరో హీరోయిన్లని ఇబ్బందులు పెడుతున్నారు మీడియా వారు. 

అడిగే ప్రశ్నలకు ఆచితూచి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అయితే తాజాగా హీరో నిఖిల్ కి సైతం అలాంటి ఒక ప్రశ్న ఎదురయింది. త్రిబుల్ ఆర్ సినిమా ఒక అబద్ధమని అందులో చూపించినవి అన్ని అబద్ధాలు అని కనీసం మీ సినిమాలో అయినా నిజం చూపిస్తున్నారా లేదా? ఇది కూడా అబద్ధమైన అంటూ నిఖిల్కి ఒక ప్రశ్న ఎదురైంది. ఇకపోతే నిఖిల్ నటిస్తున్న తాజా సినిమా స్పై ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నారు చిత్ర బృందం. ఇక ఆ ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ కి ఇలాంటివి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్న విని అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్దరూ స్వాతంత్ర సమరయోధుల కథను చెప్తున్నామని రాజమౌళి ఒక అబద్ధపు కథను తీశారు. అది ఆస్కార్ విన్ అయి ఉండొచ్చు. కానీ అది ఒక అబద్ధపు కద. కానీ ఇప్పుడు మీరు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్  సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో అయినా నిజం ఉందా లేక ఇది కూడా అబద్ధమేన అన్న ప్రశ్న ఎదురయింది. ఇక ముందుగా ఈ ప్రశ్న విన్న నిఖిల్ త్రిబుల్ ఆర్ సినిమా తెలుగు వాళ్ళను గర్వపడేలా చేసింది.ఆస్కార్ అవార్డును గెలుచుకుంది ఈ విషయం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది అబద్ధపు సినిమా కాదు..ఒక ఫిక్షనల్ కథ కానీ మేము స్పై సినిమాలో నిజాలే. చెప్తాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం సమయంలో అసలు ఏం జరిగింది ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు సీక్రెట్ గా ఉంచారు. అన్న అంశంపై ఈ సినిమాను మేము చూపిస్తాం. కచ్చితంగా స్పై సినిమా అబద్ధం సినిమా కాదు అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా సమాధానం చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు .ఇక అఖిల్ నటిస్తున్న ఈ స్పై సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: