అక్కినేని నవ యువ హీరో అయిన అఖిల్ .. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’  సినిమాతో తన కెరీర్ లోనే తన మొదటి హిట్ ను అందుకున్నాడని  చెప్పవచ్చు. అంతేకాదు ఆ సినిమా తెచ్చిపెట్టిన సక్సెస్ కిక్‌తోనే ఆ తదుపరి సినిమా ‘ఏజెంట్’ లో చాలా ఉత్సాహంగా నటిస్తున్నాడు.  ఇప్పుడు అందులోని పాత్రకోసం వెరైటీ మేకోవర్‌తో, సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని అఖిల్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’  సినిమా తర్వాత సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో .. తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘ఏజెంట్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాదు ఈ సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. అయితే హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ  ‘బార్న్' సిరీస్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పుడు మనాలిలో హై యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా తెలియజేయటమే కాకుండా ఒక ఫోటోను కూడా షేర్ చేయటం జరిగింది. అయితే ఈ ఫోటోలో హీరో అఖిల్ , దర్శకుడు సురేంద్ర రెడ్డి తో పాటు ఇతర టెక్నీషియన్స్ కనిపిస్తున్నారు. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పైన అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘ఏజెంట్’ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి  విలన్‌గా చేస్తున్నారు.

అంతేకాదు ‘యాత్ర’  సినిమా తర్వాత ఆయన చేస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. మరి కథ విషయానికి వచ్చినట్లైతే  దేశానికి ముప్పు వాటిల్లే కుట్రలు జరుగుతుండడంతో సీక్రెట్ మిషన్ ను టేకప్ చేస్తాడు హీరో. కాగా అందులో భాగంగానే  ఓ రిటైర్డ్ మిలటరీ మేజర్‌తో కూడా తలపడాల్సి వస్తుంది. అయితే చివరికి తన దేశాన్ని రక్షించుకోడానికి హీరో ఎలాంటి సాహసం చేశాడు అన్నదే కథాంశం. కాగా మిలటరీ మేజర్‌గా మమ్ముట్టి నటిస్తున్నారు. అయితే సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుండగా, హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్ ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: