టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న 30 వ సినిమా గురించి గూస్బంప్స్ తెప్పించేలా ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో భారీ బీచ్ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్గా పట్టాలెక్కనున్న ఈ సినిమాని ప్రకటించాక.. కొరటాల శివ, ఎన్టీఆర్‌ ఇక అనౌన్స్ మెంట్ ఏమి చేయకుండా సైలెంట్‌గా అలానే ఉండిపాయారు. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట లేకపోవడంతో ఈ మూవీ అసలు ఉంటుందా ? లేదా? అనే అనుమానాలు ఫ్యాన్స్ను ఎంతగానో నిరాశపరిచాయి. అప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్స్ కావాలి అంటూ సోషల్మీడియా వేదికగా ఎంతగానో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెలలలోనే షూటింగ్ ని జరుపుకుంటుందంటూ ఎన్టీఆర్... ఫ్యాన్స్పై ఈమధ్య సీరియస్ అయ్యారు. దీంతో అభిమానుల్లో ఇప్పుడు ఫుల్ జోష్ మొదలైంది. ఇప్పుడా జోష్ను మరింత రెట్టింపు అయ్యేలా.. మరో అదిరిపోయే వార్త కూడా బయటకు వచ్చింది.


ఇక ఈ సినిమా కోసం శంషాబాద్‌లో ఒక సెట్, గోవాలో మరో సెట్ వేస్తున్నట్లు  వార్తలు వచ్చాయి. మొదటి షెడ్యూల్ ఇక్కడ, రెండోది అక్కడ ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. గోవాలో జరిగే షెడ్యూల్‌లో.. బీచ్ సెటప్ ని వేసి ఓ హెవీ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేస్తున్నారట. ఈ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌.. ఈ సినిమాకే మెయిన్ హైలైట్గా నిలవనుందట. ఏకంగా షార్క్ తో ఫైట్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఈ ఫైట్ ని ఇండియాలో ఏ సినిమాలోనూ చూపించని విధంగా డిజైన్ చేశారని తెలిసింది. ఇది చూసినప్పుడు ప్రేక్షకులకు ఖచ్చితంగా పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ఈ బీచ్ యాక్షన్ సీక్వెన్స్ ఇంకా సముద్రంలో షార్క్ ఫైట్ ఈ చిత్రానికి చాలా కీలకం కానుందట. కథలో ఇక్కడి సీన్స్ చాలా ముఖ్యమట.ఇక ఇందుకోసం భారీ సెటప్ వేయబోతున్నారని కూడా సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: