'రామాయణ' ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే దానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే, షూటింగ్ మొదలైన రోజు నుంచి సెట్స్, షూటింగ్, క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫొటోలు బయటికి వస్తూనే ఉన్నాయి. దీంతో షూటింగ్ స్పాట్ ని నో ఫోన్ జోన్ గా ప్రకటించారు. ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాతలు.. ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మరో నిర్మాణ సంస్థ ఆ బాధ్యతలు తీసుకుంది. 'రామాయణ' ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక రూమర్ బయటికి వస్తూనే ఉంది. దాంట్లో భాగంగా సాయిపల్లవిని సీతగా తొలగించిన ఆమె ప్లేస్ లో జాన్వీ కపూర్ ని తీసుకున్నారనే వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ క్యారెక్టర్ కి ముందు అలియా భట్ ని అనుకున్నారని, ఆమె డేట్స్ కుదరక సాయిపల్లవిని ఫిక్స్ చేశారనే వార్త కూడా బయటికి వచ్చింది. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ యష్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నట్లు కూడా వార్తలు బయటికి వచ్చాయి. అయితే, ఈ విషయాలపై మాత్రం ఇప్పటివరకు మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి