నాచురల్ స్టార్ నాని ఆఖరుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించింది.

మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ట్రైలర్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ ట్రైలర్ ఏకంగా 100 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగింది.

ఇలా ఈ మూవీ ట్రైలర్ ఏకంగా 100 గంటల పాటు యూట్యూబ్లో టాప్ 1 ట్రెండింగ్లో కొనసాగినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలు సాధించి ఉండడంతో ప్రేక్షకులు హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: