వశిష్ట ఎన్ సింహ, తమన్నా, హెబ్బా పటేల్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఓదెలా 2. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్ గా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కించారు. మధు క్రియేషన్స్ , సంపత్ నంది టీం వర్క్స్ బ్యానర్ పై డి మధు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల అయింది.


బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించినా.. ఆశించిన స్థాయిలో వసూలు మాత్రం రాబట్ట లేకపోయింది. మూడు రోజుల్లో రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. మే 17వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


 ఇక ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి అయితే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా  ఇప్పుడు ఓటీటీకి సిద్ధమవుతోంది. ఇక ఓదెల 2 విషయానికి వస్తే ఓదెల లో తిరుపతి అనే కామాంధుడు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను శారీరకంగా నాశనం చేస్తూ ఉంటాడు. దీంతో తిరుపతి భార్య అతని తల నరికి జైలుకు వెళుతుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని సమాధి శిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల అతడు ప్రేతాత్మగా మారి, తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో రంగంలోకి దిగిన శివశక్తి ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్ట సంహారమే మిగిలిన స్టోరీ. ఈ సినిమా కూడా భారీగా విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: