ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతిలో భూములు కొనుగోలు చేయాలని సామాన్య ప్రజలు కలలు కంటున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో ఎకరం 20 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. టీడీపీ అనుకూల పత్రిక రాసిన కథనం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. 4,000 కోట్ల ఎకరాలు 80,000 కోట్ల రూపాయలకు విక్రయించేలా ఏపీ సర్కార్ ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది.
 
అమరావతిలో ప్రాజెక్ట్స్ కోసం వచ్చిన డబ్బును వినియోగించనున్నారని భోగట్టా. ఇప్పటికే తీసుకున్న కొన్ని రుణాలను సైతం చెల్లించే విధంగా ఏపీ సర్కార్ ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. రెండో దశ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 60 - 40 నిష్పత్తిలో భూములు ఇస్తారని సమాచారం అందుతోంది. అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారని సమాచారం అందుతోంది.
 
భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలుస్తోంది. 20 కోట్ల రూపాయలకు వేలం వేసి అన్ని ఎకరాలను అమరావతిలో విక్రయిస్తారో చూడాల్సి ఉంది. అయితే 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి భూములను కొనుగోలు చేసే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
బెజవాడ గుంటూరు హైవేలో సైతం ఆ రేటు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధాన నగరాల శివార్లలో ఇంతకంటే తక్కువ మొత్తానికే స్థలాలు, పొలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ రేట్లకు అమ్మేవాళ్లు ఉన్నా ఆ రేట్లకు కొనేవాళ్లు సిద్ధంగా లేకపోవడం సంచలనం అవుతోంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ రేట్లపై వైసీపీ స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: