
ఈ సినిమాతో వాళ్ల రేంజ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది .వాళ్ళపై ఉన్న అభిమానం కూడా ఇంకా పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ మళ్ళీ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు . దాని కోసం వెయిట్ చేశారు . కానీ అది ఎందుకో సెట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి ఆ సాహసాన్ని చేస్తున్నాడు అన్న న్యూస్ బయటకు వచ్చింది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ సినిమాలో కెమియో రోల్ పాత్రలో చరణ్ - తారక్ ని చూపించబోతున్నారట .
అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఐదు నిమిషాల పాటు వీళ్ళిద్దరి క్యారెక్టర్ లని చాలా ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నారట. వీళ్ళ పాత్రలను అలానే రాసుకున్నారట . మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో తారక్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట . త్వరలోనే ఈ సీన్స్ ని కూడా చిత్రీకరించబోతున్నారట అనిల్ రావిపూడి . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హైలైట్ గా మారి ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా లో చిరంజీవిని మనం ఎప్పుడు చూడని క్యారెక్టర్ లో చూయించబోతున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి..!