రాజమౌళి ఇండస్ట్రీలో ఒక బిగ్ స్టార్ . ఇండియాకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చేంత టాలెంట్ ఉన్న స్టార్ . ప్రతి ఒక్క స్టార్ హీరో రాజమౌళితో సినిమా చేయాలి అంటూ వెయిట్ చేస్తూ ఉంటారు . కానీ ఆ అవకాశం అందరికీ రాదు. ఆయన కొంతమందిని మాత్రమే చూస్ చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు . అయితే ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్ యాంగిల్ ఉన్నట్టు మరొక నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుంది.  ఒక రూపాయికి రెండు సైడ్స్ ఉంటాయి. అదేవిధంగా రాజమౌళికి కూడా రెండు సైడ్స్ ఉన్నాయి అని ఎప్పుడు ఒకే హీరోతో స్టార్ స్టేటస్ ఉన్న హీరోలతోనే సినిమాలు తెరకెక్కిస్తున్నాడు అంటూ కొంత మంది జనాలు దారుణంగా మాట్లాడారు.


ఎప్పుడు స్టార్ స్టేటస్ ఉన్న హీరోలతో తెరకెక్కిస్తే ఎలా..? అంటూ టైం చూసి తప్పు దెబ్బ కొడుతున్నారు రాజమౌళి హేటర్స్.  రాజమౌళికి ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు హేటర్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే . ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఎంత రాద్ధాంతం సృష్టించారో అందరికీ తెలిసిందే.  అంతే కాదు రాజమౌళి - మహేష్ బాబుని డైరెక్ట్ చేయబోతున్నాడు అనగానే చాలామంది నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు . అయితే ఇప్పుడు రాజమౌళి మరొకసారి అడ్డంగా బుక్ అయిపోయాడు . రీసెంట్గా రాంచరణ్ - ఎన్టీఆర్ - రాజమౌళికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఎంత బాగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలుసు.



ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వీళ్ళ గురించి వార్తలు వచ్చాయి . అంతలా ఆ వీడియో ట్రెండ్ అయ్యింది.  అయితే ఇక్కడే రాజమౌళి అడ్డంగా దొరికిపోయాడు.  ప్రతిసారి స్టార్ స్టేటస్ ఉన్న హీరోలతోనే మింగిల్ అవుతూ వాళ్లతోనే సినిమాలు తీస్తే నీ రేంజ్ ఎప్పటికి పెరుగుతూనే ఉంటుంది.  ఒక్కసారి ఫ్లాప్ ఉన్న హీరోతో సినిమా చేసి హిట్ కొడితే నీ రేంజ్ పెరగడంతో పాటు ఆ స్టార్ కి కూడా లైఫ్ ఇచ్చినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పాన్ ఇండియా అంటూ పాన్ ఇండియా స్టార్స్ తోనే సినిమా తీస్తే కచ్చితంగా వాళ్లకున్న అభిమానులు ఆ సినిమా హిట్ చేస్తారని.. దమ్మున్న డైరెక్టర్ అయితే పాన్ ఇండియా సినిమాను ఒక ఫ్లాప్ హీరో చేత చేయించి హిట్ కొడితే అప్పుడు రియల్ పాన్ ఇండియా  డైరెక్టర్ అంటూ ట్యాగ్ చేయించుకునే స్టేటస్ ఉంది అని నమ్మొచ్చు అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు.  కేవలం రాజమౌళికే కాదు ప్రశాంత్ నీల్ కి సుకుమార్కి సైతం ఇలాంటి ఓపెన్ సవాళ్లు విసురుతూనే వస్తున్నారు . నిజమే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేసుకుంటూ పోతే మరి టైర్ 2.. చిన్న హీరోల పరిస్థితి ఏంటి ..? వాళ్లకి కూడా ఒక లైఫ్ ఉంటుంది గా .. వాళ్ళని పెద్ద డైరెక్టర్లు పట్టించుకోవాలిగా అంటూ కామన్ పీపుల్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: