
అయితే ఇటీవల మరోసారి మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నిర్మాత దిల్ రాజు సత్యనారాయణ పేరు చెప్పారు. దీంతో జనసేన పార్టీలో కలకలం మొదలైంది. ఈ కారణంగా రాజమండ్రి సిటీ ఇంచార్జ్ పదవితో పాటుగా పార్టీ నుండి కూడా అత్తి సత్యనారాయణను తొలగించడం జరిగింది. నిజాలు అన్నీ తెలిసే వరకు అతి సత్యనారాయణ పార్టీకి దూరంగా ఉండాలని వెల్లడించారు.
ఇక జనసేన నుండి బహిష్కరణకు గురైన అతి సత్యనారాయణ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియా మీటింగ్ లో మాట్లాడుతూ.. జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేయాలని ప్రకటించారని అన్నారు. థియేటర్ ల బంద్ గురించి దిల్ రాజు తమ్ముడు మాట్లాడాడని అన్నారు. ఆయన తమ్ముడిని రక్షించుకోవడం కోసం తనని కావాలనే ఇరికించారని స్పష్టం చేశారు. దిల్ రాజ్ నటనలో కమల్ హాసన్ ని మించిపోయారని.. ఆస్కార్ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇస్తున్నారని ఆరోపించారు. దుర్దేశంతోనే తన పేరు చెప్పారని అన్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో జనసేన పేరు ఎత్తారని చెప్పుకొచ్చారు. తను థియేటర్లను బందు చేయాలని ఎక్కడ అనలేదని అతి సత్యనారాయణ స్పష్టం చేశారు. మరి ఈ ఇష్యూ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.