ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనను పుష్ప 2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా గుర్తించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో అల్లు అర్జున్ కి అవార్డ్ ని అందించింది. ఈ గద్దర్ అవార్డ్స్ ని తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత ప్రకటించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ కి చాలా మంది అభిమానులు వచ్చారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుతీవ్రంగా పులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత విడుదల అయ్యి బయటికి రావడం కూడా జరిగింది. సినీ ప్రముఖులు అందరూ ఆయనను వెళ్లి పరామర్శించడం జరిగింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వమే అన్యాయంగా బన్నీని అరెస్టు చేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి పై అల్లు అర్జున్ కౌంటర్ లు వేయడం కూడా అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి అన్ని సర్దుమనిగాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వార్త తెలుసుకున్న కొందరు రేవంత్ రెడ్డికి బన్నీపై ఎలాంటి పగలేదని ఉంటే గద్దర్ అవార్డులో బన్నీకి స్థానమే ఇచ్చేవారు కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక వీరి వివాదం కూడా ఈ అవార్డులతోనే ముగిసిపోయిందని మరి కొంతమంది అంటున్నారు.