టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అఖండ మూవీకి కొనసాగింపుగా రూపొందుతూ ఉండటంతో అఖండ 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా మేకర్స్ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. దానితో ఈ మూవీ టీజర్ ఏకంగా 132 గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ వారు కూడా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఈ సినిమా టీజర్ మాత్రం అఖండ మూవీ యూట్యూబ్ రికార్డు కి చాలా దూరంలోనే ఆగిపోయింది. రాజా సాబ్ మూవీ టీజర్ యూట్యూబ్లో 116 గంటల పాటు నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగింది. ఇక యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్ లో అత్యధిక గంటలు కొనసాగిన తెలుగు సినిమా టీజర్ల విషయంలో అఖండ 2 మూవీ టీజర్ నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉంటే , రాజా సాబ్ మూవీ టీజర్ ఏకంగా 11 వ స్థానంలో కొనసాగుతుంది. ఈ రెండు మూవీ టీజర్ల స్థానాల మధ్య చాలా ఎక్కువ తేడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: