గత శుక్రవారం విడుదలైన `కుబేర` చిత్రానికి హిట్ టాక్ లభించిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అటు ధనుష్, ఇటు నాగార్జున చెలరేగిపోయారు. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన కుబేర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్లో కుబేర సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


అయితే కుబేర సక్సెస్ మీట్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. హీరో ధనుష్‌ ఆడిటోరియంకు రాగానే చిత్ర బృందాన్ని ఒక్కొక్కరిగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి చూడగానే ధనుష్ వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ధనుష్‌ పాదాభివందనం చేస్తుండగా చిరంజీవి వారిస్తూ పైకి లేపి ఆలింగడం చేసుకొని అభినందనలు తెలిపారు. ఆపై ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ధనుష్‌ సింప్లిసిటీ పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ధనుష్‌ కు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా స్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఎంతటి స్టార్ హీరో అయిన‌ కూడా పెద్దలకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. దటీజ్ ధనుష్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ధనుష్‌ తెలుగులో నేరుగా చేసిన రెండో చిత్రం కుబేర. అంతకుముందు `సార్` మూవీ తో క్లాస్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ధనుష్.. ఇప్పుడు కుబేరతో కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు





మరింత సమాచారం తెలుసుకోండి: