ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో 100 కోట్ల హీరోగా మారిన వెంకటేష్ తన భవిష్యత్ సినిమాల ఎంపిక పై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 60 సంవత్సరాలు దాటిపోవడంతో తన దగ్గరకు వచ్చిన ప్రతి కథను ఒప్పుకోకుండా తన ఇమేజ్ కి అదేవిధంగా తన వయసు కి తగ్గ పాత్రలను ఎంపిక చేసుకోవాలని వెంకటేష్ ప్లాన్.



ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చేసిన వెంకటేష్ ఆసినిమా తరువాత నటించవలసిన సినిమాల విషయమై ప్రస్తుతం పెద్దగా ఆలోచించడం లేదు అని అంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో మళయాళ టాప్ హీరో మోహన్ లాల్ తీసుకున్న నిర్ణయం ఈ ఫ్యామిలీ హీరోను కన్ఫ్యూజన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మోహన్ లాల్ జీతూ జోసఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 3’ చేయడానికి అంగీకరించడమే కాకుండా ఈసినిమా షూటింగ్ ఈ సంవత్సరం అక్టోబర్ నుండి ప్రారంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఇదే సీక్వెల్ ను హిందీలో అజయ్ దేవ్ గన్ చేయడానికి అంగీకరించాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైన శవం చుట్టూ తిరిగే ‘దృశ్యం’ కథ పార్ట్ 3 తో ముగింపుకు వస్తుందని తెలుస్తోంది. డెడ్ బాడీని ఇంత కాలం దాచి పెట్టిన హీరో చివరికి దాన్ని తల్లి తండ్రులకు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్ లో ఇరుక్కుపోవడంతో నేరం చేసినవాడు ఏదోఒక సందర్భంలో ఏదో ఒకరోజు దొరికిపోతాడు అన్న ముగింపుతో ‘దృశ్యం 3’ ముగింపుకు వస్తుందని టాక్.  



ఈ మూవీలో రాంబాబు పాత్రలో వెంకటేష్ తప్ప మరే తెలుగు హీరో సరిపోదు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ నిర్మాతలు ఒకేసారి మళయాళం హిందీ తెలుగులో నిర్మించాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ సీక్వెల్ లో వెంకటేష్ తహాను నటించాల లేదా అన్న విషయం ఆలోచించుకోవడానికి కొంత సమయం అదిగినట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: