సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారు కూడా ఆ తర్వాత క్రేజ్ తగ్గాక సినిమాలో హీరోయిన్ల పాత్రల రాకపోయాక వారు ఇతర పాత్రలలో నటించడానికి ఆసక్తిని చూపించడం మనం ఎన్నో సార్లు చూసాం. స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించి ఆ తర్వాత ఇతర పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో వీరి ఎంట్రీ కాస్త ఎక్కువగానే అయింది. ఈ మధ్య కాలంలో అలా ఎంట్రీ ఇచ్చిన వారు ఎవరు ..? ఇవ్వడానికి రెడీగా ఉన్నా వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో లయ ఒకరు. ఈమె స్వయంవరం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటించి తన అందాలతో , నటనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె చాలా కాలం నుండి సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంది. తాజాగా ఈమె నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు సినిమాలో నితిన్ కు అక్క పాత్రలో నటించింది. ఈమె నితిన్ కు అక్క పాత్రలో నటించింది అనడంతో కూడా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కాస్త పెరిగాయి. తాజాగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కానీ ఈ సినిమాలోని లయ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆది మూవీ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కీర్తి చావ్లా ఇప్పటికే లైలా మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక నువ్వు నేను మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిత "ఓ భామ అయ్యో రామా" అనే మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా ఒకప్పుడు అద్భుతమైన క్రేజీ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారు ఇప్పుడు సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: