
నిన్నటి రోజున సాయంత్రం సక్సెస్ మీట్ ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయగా ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజకీయాల వల్ల, ప్రత్యర్థుల కుట్రల వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారని తెలియజేశారు. వీరమల్లు సినిమాకి అన్ని విధాల తాను సహకరిస్తానని అది తన బాధ్యత అంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్. సక్సెస్ మీట్ కి రావడం కొంతమేరకు ఆలస్యం కావడంతో పవన్ కళ్యాణ్ కోసం వేచి ఉన్న వారందరికీ క్షమాపణలు తెలియజేశారు. క్యాబినెట్ మీటింగ్ వల్ల ఆలస్యం అయ్యిందంటూ పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.
వాస్తవానికి ఇలాంటి వాటికి సంజాయిసి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో వినయంగా ఒదిగి ఉండే స్వభావం కావడం చేత పవన్ కళ్యాణ్ అలా చేశారంటూ అభిమానులు తెలుపుతున్నారు.. తనకు సినిమా ప్రమోషన్స్ అలవాటే లేదని.. కానీ తన మిత్రుడు అయిన కేవలం రత్నం కోసం మాత్రమే రావాల్సి వచ్చిందంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్. తనవల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచిస్తారు కాబట్టే పవన్ కళ్యాణ్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.