
సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు మూవీ మేకర్స్ . అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే ముందే మూడుసార్లు ట్రిమ్మింగ్ చేయడం బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ముందుగా ఈ సినిమాకు 152 నిమిషాల 49 సెకండ్ల నిడివి లాక్ చేశారు మూవీ మేకర్స్. సెన్సార్ కూడా పూర్తి చేసేశారు . ఆ తర్వాత కొన్ని రోజులకే మనసు మార్చుకున్న మూవీ మేకర్స్ సినిమా నుంచి దాదాపు తొమ్మిది నిమిషాల ఫుటేజ్ ని తొలగించారు. తిరిగి మళ్ళీ సెన్సార్ చేయించారు.
అయితే ఈ తొమ్మిది నిమిషాల ఫుటేజ్ కారణంగా దాదాపు 34 కోట్ల నష్టం వచ్చింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది . అయితే రెండవసారి రన్ టైం 173 నిమిషాల 24 సెకండ్లకు ఫిక్స్ అయ్యింది. హిందీ వర్షన్ కొద్దిగా ఫిక్స్ చేశారు . అంత సెట్ అనుకున్నా మూమెంట్లో వార్ 2 సినిమా మరొకసారి ట్రిమ్మింగ్ బారిన పడ్డింది . ఈసారి మరో రెండు నిమిషాల సన్నివేశాలు కట్ చేశారు. ఇది హై యాక్షన్ సీన్స్ అంటూ టాక్ వినిపించింది. దీనికారణంగా ఏకంగా 14 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అంటూ టాక్ వినిపించింది .
ఫైనల్లీ ముచ్చటగా మూడోసారి 171 నిమిషాల 44 సెకన్ల రన్ టైం ఫిక్స్ చేశారు . ఇది తెలుగు వర్షన్ కోసం. ఇలా సినిమాను ఇప్పటివరకు మూడుసార్లకు ట్రిమ్ చేసి సుమారు 50 కోట్లకు పైగా నష్టం వాటిల్లేలా చేసుకున్నారు మూవీ మేకర్స్ అంటున్నారు బాలీవుడ్ స్పెషలిస్టులు . తాజా సమాచారం ప్రకారం కియరా అద్వానికి చెందిన కొన్ని సన్నివేశాలు తెలుగు వర్షన్ లో కట్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా సగం సినిమా ట్రిమింగ్ లతోనే లేపేశారు అన్న కౌంటర్స్ కూడా పడుతున్నాయ్. చూడాలి మరి సినిమాకి ఎలాంటి టాక్ వినిపిస్తుందో..??