
1. లోకేష్ కనగరాజ్ మార్క్ డైరెక్షన్:
‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి హిట్స్ తర్వాత లోకేష్ యాక్షన్ సీన్స్‌ను ఎలా తెరకెక్కించాలో బాగా తెలుసు. ఈ సినిమాలో కూడా ఆ యాక్షన్ స్టైల్‌తో బిగ్ సక్సెస్ సాధించారు.
2. గ్యాంగ్‌స్టర్ డ్రామా:
రజనీకాంత్‌ని మనం పవర్‌ఫుల్, యాక్షన్, ఎమోషనల్ రోల్స్‌లో చాలాసార్లు చూశాం. కానీ ఈ పాత్ర మాత్రం అన్నిటికీ మిక్స్ — అన్ని రకాల ఎమోషన్స్ ఒకే పాత్రలో చూడదగ్గది.
3. అనిరుద్ సంగీతం:
ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న అనిరుద్, ఈ సినిమాతో మరింత ఎత్తుకు వెళ్లాడు. ఆయన ఎనర్జిటిక్ భ్ఘం, పాటలు థియేటర్‌లో వింటే వేరే కిక్ ఇస్తాయి.
4. విజువల్ స్పెక్టకిల్:
అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హై-ఆక్షన్ సీన్స్ ఈ సినిమాకి మరో బిగ్ ప్లస్ పాయింట్.
5. LCU (Lokesh Cinematic Universe):
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. కథ సింపుల్ అయినా, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడేలా తెరకెక్కించారు.
6. నాగార్జున విలన్ అవతారం:
నెగిటివ్ రోల్‌లో నాగార్జున అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి.
7. అమీర్ ఖాన్ రోల్:
ఈ సినిమాకి అమీర్ ఖాన్ రోల్ కీలక బూస్ట్ ఇచ్చింది. కథలో ఆసక్తిని పెంచింది.
8. రజనీ–సత్యరాజ్ రీయూనియన్"
36 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించడం ఫ్యాన్స్‌కి బిగ్ కిక్ ఇచ్చే ప్లస్ పాయింట్.
9. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫీల్:
రజనీకాంత్ సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఫ్యాన్స్‌కి పండుగ. ఈ సినిమా కూడా ఆ హంగామా పక్కా ఇస్తుంది.
10. ఫ్యాన్స్‌కి వేరే లెవెల్ ఫీల్:
యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మస్ట్ వాచ్. ముఖ్యంగా రజినీ ఫ్యాన్స్‌కి ఇది వేరే లెవెల్ అనుభూతిని ఇస్తుంది అని సినీ ప్రముఖులు అంటున్నారు.