#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటనలో మౌళి ఒకరు. ఈయన తాజాగా లిటిల్ హాట్స్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను కూడా అందుకుంది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 17 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎన్ని ..? ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

17 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 6.63 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.40 కోట్లు , ఆంధ్ర లో 6.47 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17 రోజుల్లో ఈ సినిమాకు 14.50 కోట్లు ... 26.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక 17 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 5.62 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20.12 కోట్ల షేర్ ... 37.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2.75 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 3 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా 17.12 కోట్ల లాభాలను అందుకొని అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: