
ఇక రాజకీయంగా కూడా లోకేష్ ప్రభావం మంగళగిరిలో బాగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి సీరియస్‌గా పనిచేసే నాయకత్వం లేకపోవడంతో టీడీపీ ఇక్కడ మరింత బలంగా నిలుస్తోంది. ప్రజల మద్దతు సహజంగానే బాగా పని చేస్తోన్న లోకేష్ వైపు మళ్లుతోంది. లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం పెరగడం పార్టీకి అదనపు బలం చేకూరుస్తోంది. ఇటీవల నారా లోకేష్ పేరు విశాఖపట్నంలోనూ మార్మోగుతోంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు విషయంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న వార్తలు వెలువడుతున్నాయి. అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులను కలసి, ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ముఖ్యమైంది. ఈ ప్రయత్నం వల్ల లోకేష్‌కు మాత్రమే కాకుండా టీడీపీ ప్రభుత్వానికి కూడా మంచి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది.
ఈ అంశాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఇటీవల ప్రస్తావించారు. “గూగుల్ ప్రాజెక్ట్ అనగానే అందరూ చంద్రబాబును గుర్తుపెట్టుకుంటారు. కానీ ఈసారి మంత్రి నారా లోకేష్ కృషి కూడా ప్రజలకు బాగా తెలిసిపోయింది. దాంతో ఆయన గ్రాఫ్ గణనీయంగా పెరిగింది,” అని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే, నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానంలో కొత్త దశను ప్రారంభించారు. మంత్రి హోదాలో అభివృద్ధి పనులు, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు, ప్రజలతో నేరుగా కలిసే తీరు అన్నీ కలసి లోకేష్ క్రేజ్‌ను మరింత పెంచాయి. మంగళగిరి నుంచి విశాఖ వరకు ఆయన పేరు వినిపిస్తున్న ఈ స్థితిలో, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ ప్రభావం మరింత విస్తరించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.