తెలంగాణలో వైయస్ షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు ఏంటి అనే దానిపై ఇప్పుడు స్పష్టత రావడం లేదు. ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అడుగులు వేసిన షర్మిల దాదాపు 15 రోజుల నుంచి పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటంలేదు. మీడియాలో కూడా ఆమె కనబడటంలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేయడం మినహా ఆమె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేయలేకపోతున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వస్తున్న అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా సరే షర్మిల మాత్రం ఈ అంశంలో ఒక వ్యాఖ్య కూడా చేయలేదు.

అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారిపై ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపించి సరిహద్దు లోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో షర్మిల విషయంలో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆమె మాట్లాడక పోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయితే ప్రశాంత్ కిషోర్ సైలెంట్ కావడం వల్లనే వైయస్ షర్మిల కూడా సైలెంట్ అయ్యారు అనేది కొంతమంది మాట. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకోవడంతో రాజకీయాల విషయంలో పునరాలోచనలో పడ్డారని టాక్.

తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని భావించారని కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకోవడంతో షర్మిల కూడా కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ మంత్రి ఈటల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉండటమే కాకుండా టిఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే నాయకులు కూడా అటు వైపు వెళ్లే అవకాశం ఉంటుంది అని ఆమె భావిస్తున్నారు. అప్పుడు షర్మిల పార్టీలోకి పెద్దగా చేరికలు కూడా ఉండకపోవచ్చని సైలెంట్ అయ్యారు అనేది కూడా కొంతమంది భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: