పాకిస్తాన్ తన ప్రతీకారం కోసం పసిప్రాయాలను తీవ్రవాదులుగా తీర్చిదిద్దుతుంది. భారత్ నుండి చిన్నపిల్లలను మానవ ఆక్రమ రవాణా ద్వారా పాక్ కు చేర్చి అక్కడ వారికి చిన్ననాటి నుండే ఇస్లాం బోధిస్తూ, దానితోపాటుగా భారత్ పై పగను వాళ్ళ మనసులో ముద్రిస్తూ వాళ్ళను ఉగ్రవాదులుగా, మానవ బాంబులుగా మర్చి దేశాలపై విడిచిపెడుతుంది. దీనితో వాళ్ళు కూడా చేసేది లేక తమ మనసు లో పాక్ నాటిన విషం ప్రకారం నడుచుకుంటున్నారు. అమాయకులను హతమారుస్తు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు దొరికిపోయినా పాక్ పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు కేవలం తన దృష్టిలో వస్తువులే. పని అయిపోయాక వాళ్ళు ఏమి అయిపోయినా పాక్ పట్టించుకోదు.

ఇప్పటివరకు దేశంలో జరిగిన ఏ ఉగ్రకుట్రలో అయినా సరే పాల్గొన్న వారు కేవలం 20  ఏళ్లలోపు వారే. ప్రపంచంలో పేదరికంలో మగ్గిపోతున్న వారిని కూడా ఉగ్రవాదం లక్ష్యంగా చేసుకొని మానవ అక్రమ రవాణా ద్వారా వారిని ఉగ్రసంస్థలకు తరలించి మానవ బాంబులుగా మార్చేస్తున్నారు. అసలు ప్రపంచంలో చాలా చోట్ల పేదరికం ఇందుకే తీర్చకుండా అక్కడ వారిని ఉగ్రవాదం కోసం వాడుకుంటున్నారు అనేది ఎప్పటి నుండో ఉన్న అనుమానమే. దానికి ప్రపంచమే సమాధానం చెప్పాలి. ఉన్నవాడు, లేనివాడు అనే తేడా లేకుండా ఎవరికి తోచినంత వారు ఆయా వనరులను వృధా చేస్తున్నారు తప్ప పేదరికంలో మగ్గిపోతున్న దేశాలకు వాటిని అందించాలని మాత్రం ఎవరు అనుకోవడంలేదు. దీనితో ఈ సమన్వయ లోపం ఉగ్రభూతాలకు కలిసి వస్తుంది.

తాజాగా భారత్ లో సరిహద్దులలో చొరబాటుకు యత్నించి ప్రాణాలతో పట్టుబడ్డ తీవ్రవాది కూడా కేవలం 19 ఏళ్ళ వాడు మాత్రమే. తన పేదరికాన్ని  అడ్డుపెట్టుకొని ఉగ్రభూతాలు తనను ఆయుధంగా వాడుకున్నాయని అతడు విచారణలో చెప్పాడని అధికారులు తెలిపారు. ఇంకా ఎన్నో చొరబాట్లు  సరిహద్దులలో సిద్ధంగా ఉన్నాయని అతడు సమాచారం ఇచ్చినట్టు అధికారులు అంటున్నారు. గతంలో ఆర్మీ ర్యాలీ పై జరిగిన దాడి తరహాలో ఉగ్రదాడికి వారు ప్రణాళిక వేసినట్టు అతడు చెప్పాడని అధికారులు అంటున్నారు. ఆఫ్ఘన్ అక్రమణ అనంతరం దేశంలోకి ఇలాంటి చొరబాట్లు పెరిగిపోతాయని నిఘావర్గాలు చెప్పినట్టుగానే సరిహద్దులలో జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: