డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సిఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. ఏపీ ప్రభుత్వం పై విపక్షాల నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చిన నేపధ్యంలో సిఎం జగన్ అలెర్ట్ అయ్యారు. ప్రతీ విషయాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి. గంజాయి విషయంలో అయితే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ లు ఇచ్చారు. గంజాయి కి సంబంధించి అలాగే డ్రగ్స్ కి సంబంధించి విపక్షాలు చేసిన ఆరోపణలు వివాదాస్పదం అయ్యాయి.

విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సిపి బత్తిన శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సిపి బత్తిన శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఏడాదిన్నారగా యాంటీ డ్రగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం అని ఆయన అన్నారు. గంజాయ్ కు అలవాటుపడిన యువత, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం అని వివరించారు. 560 మందిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చాం అని తెలిపారు. కౌన్సెలింగ్ తీసుకున్న వారిని మానిటరింగ్ చేస్తూ,వారి ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాం అని అన్నారు.

యువకులు గంజాయ్ కు బానిసలుగా మారినట్లు తల్లిదండ్రులకు కూడా తెలియదు అని అన్నారు ఆయన. డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారిలో ఎక్కువుగా విద్యార్థులు ఉండడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. డ్రగ్స్ కు బానుసలుగా మారడం కారణంగా విద్యార్థుల మానసిక పరిస్థితి సరిగా ఉండదు అని డ్రగ్స్ కు బానుసలుగా మారినవారు నేరాలవైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులు నమోదు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి అని హెచ్చరించారు. మొదటి సారి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినవారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం అని కళాశాలలో డ్రగ్స్ పై విద్యార్థులకు,యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap