పట్టు విడవకుండా పోరాడాలే కానీ సాధించలేనిది ఏదీ లేదు అని చెబుతూ ఉంటారు. మనిషి తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు అని అంటూ ఉంటారు. కృషివుంటే మనుషులు రుషులవుతారు అన్న ది పెద్దలు చెప్పే మాట. అయితే ఇదంతా నిజమే అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. పట్టుదలతో పోరాడి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా.. అనుకున్నది సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు కూడా ఇలా ప్రస్తుతం నేటి యువతకు ఎంతో ఆదర్శంగా మారిపోయాడు అని చెప్పాలి


 అందరిలాగానే అతను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే.. పోలీసు ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. దాదాపుగా మూడేళ్ల క్రితం ఉద్యోగం సాధించాలనే తపనతో ఇక ఎస్ ఐ జాబ్ కోసం అప్లై చేసాడు. కానీ త్రుటిలో ఇక ఈ ఉద్యోగం అతనికి దక్కలేదు. అయినప్పటికీ అతను మాత్రం కుంగిపోలేదు. అప్పటి నుంచి మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఎస్సై కావడం కాదు ఏకంగా ఐపీఎస్ అవుతాను అంటూ నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా లక్ష్యం కోసం ప్రతి అడుగు వేసాడు. ఇక ఇప్పుడు ఏకంగా శిక్షణ పూర్తి చేసుకుని ఐపీఎస్ ఆఫీసర్ గా విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు.


 తెలంగాణకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన సంకీర్త్ ఒకప్పుడు ఎస్సై ఉద్యోగము కోల్పోయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఐపీఎస్ గా మారిపోయాడు. మూడేళ్ల కిందట ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసిన సమయంలో ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ లో కొన్ని సెకన్ల తేడాతో ఉద్యోగం కోల్పోయాడు. కానీ ఆ తర్వాత తన యూపీఎస్సీ పరీక్షను  క్లియర్ చేశాడు. మిషన్ భగీరథలో ఏఈ గా జాబ్ చేస్తూనే పరీక్షల కోసం సిద్ధమయ్యాడు. ఇక యూపీఎస్సీ పరీక్షల్లో ఏకంగా 300 ర్యాంక్ సంపాదించాడు. ఇక ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు.ఇక మరికొన్ని రోజుల్లో విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ips