అభివృద్ధికి...ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదా? అంటే..అబ్బే పెద్దగా లేదని వైసీపీకి వ్యతిరేక శ్రేణులు మాట్లాడుతున్నాయి. అసలు జగన్ వచ్చాక ఏపీలో అభివృద్ధి అనే మాటే లేదని విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధికి జగన్ ఆమడ దూరంలో ఉన్నారని, ఏపీలో రోడ్లని చూస్తుంటే అర్ధమవుతుందని అభివృద్ధి ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు చేసే విమర్శలని వైసీపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

ఏపీలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. సరే ప్రతిపక్షాలు ఏమో అభివృద్ధి లేదని అంటున్నాయి...వైసీపీ నేతలు అభివృద్ధిలో ఏపీ దూసుకెళుతుందని చెబుతున్నారు. అయితే రాజకీయ పార్టీల మాటలని పక్కనబెడితే...కాస్త వాస్తవ పరిస్తితులని చూస్తే...ఏపీలో అభివృద్ధి తక్కువే అని చెప్పొచ్చు. కానీ సంక్షేమ రంగంలో మాత్రం ఏపీ ముందు ఉంది...అందులో ఎలాంటి డౌట్ లేదు.

అయితే ఏపీలో అభివృద్ధి చేయడానికి సీఎం జగన్ ఈ మధ్య కాస్త ముందు అడుగులు వేస్తున్నారు. కొన్ని కొన్ని సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా పులివెందుల నియోజకవర్గంలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లు, 14 వేల చేపలు, రొయ్యల విక్రయ రిటైల్‌ షాపులు ఓపెన్ చేశారు...అలాగే పులివెందులలో కూడా చేపలు, రొయ్యల షాపులు ఓపెన్ చేశారు. అలాగే జగనన్న మెగాటౌన్‌షిప్‌ల పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. అటు పులివెందులలో ప్రముఖ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

అయితే పులివెందులలో ఆక్వా హబ్‌లు రావడం చాలా ఆనందంగా ఉందని జగన్ అన్నారు. సరే ఆక్వా హబ్‌లు రావడం మంచి విషయమే..కానీ అదే అభివృద్ధి అనుకుంటే పొరపాటే అని, చేపల రిటైల్ షాపులు వస్తేనే అభివృద్ధి అనుకుంటే కష్టమే. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకు రాకుండా చేపల షాపులు ఓపెన్ చేసి...ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నట్లు వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి. అవును నిజమే...చేపలు, రొయ్యలు షాపులు వస్తే అభివృద్ధి అయినట్లేనా!

మరింత సమాచారం తెలుసుకోండి: