ఏపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనే చెప్పొచ్చు. ఈ రెండున్నర ఏళ్లలో మిగతా ఎమ్మెల్యేలు కాస్త ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు గానీ...రెడ్డి ఎమ్మెల్యేలపై మాత్రం అంతగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. ఏదో తక్కువ మందికే తప్ప...మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే రెడ్డి ఎమ్మెల్యేలే బాగా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. అసలు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ నిలబడటానికి కారణమే రెడ్డి ఎమ్మెల్యేలు. అందుకే ఆ జిల్లాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా వైసీపీ తిరుగులేని పొజిషన్‌లో ఉండటానికి కారణం ఈ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే. చిత్తూరులో 13 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో సగం మంది రెడ్డి ఎమ్మెల్యేలే. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, నగరిలో రోజా రెడ్డిలు ఉన్నారు.

అంటే 13 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 7 గురు రెడ్డి ఎమ్మెల్యేలే. అందుకే చిత్తూరులో వైసీపీ ఇంత స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇక ఈ రెండున్నర ఏళ్లలో రెడ్డి ఎమ్మెల్యేల బలం ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు బలంగానే ఉన్నారు. అసలు పుంగనూరులో పెద్దిరెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు..ఈయన్ని ఓడించడం జరిగే పని కాదు.

తంబళ్ళపల్లెలో ద్వారకానాథ్, చంద్రగిరిలో చెవిరెడ్డిలు టాప్‌లో ఉన్నారు. భూమన సైతం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అటు మధుసూదన్ బలం కూడా ఏ మాత్రం తగ్గ్లేడు. అయితే నగరిలో రోజా, పీలేరులో చింతలకు కాస్త ఇబ్బంది అవ్వొచ్చు...ఎందుకంటే వీరికి అపోజిట్‌గా ఉన్న టీడీపీ నేతలు స్ట్రాంగ్ అవుతున్నారు. అటు నగరిలో రోజాకు సొంత పార్టీ నేతలతోనే ఇబ్బంది ఉంది. మొత్తానికైతే చిత్తూరులో రెడ్డి ఎమ్మెల్యేల బలం తగ్గేదేలే.  

మరింత సమాచారం తెలుసుకోండి: