ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కు భద్రతా బలగాలను పంపుతామని స్పష్టం చేశారు. రష్యాను ఎదిరించేందుకు అంతా ఏకమవ్వాలని బైడెన్ పిలుపునిచ్చారు. అయితే దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

 మోహరించాలన్న రష్యా ఆదేశాలను ఖండిస్తున్నట్టు వెల్లడించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు వివరించింది. రక్తపాతం సృష్టించాలనేది తమ ఉద్దేశం కాదని తెలిపింది. రష్యాకు యాంటీగా అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల పాత్రను గమనిస్తున్నట్టు రష్యా పేర్కొంది.

ఇక రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడం పట్ల యూఎన్ఎస్ సీ భేటీలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు ఈ ప్రాంత శాంతి భద్రతకు ఆటంకం కలిగించే అవకాశముంది. 20వేల కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నారనీ.. భారతీయుల శ్రేయస్సు తమకు ప్రధానమని తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించడం అవసరమంది. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది.


ఉక్రెయిన్ లో ఉద్రిక్తతల కారణంగా కేంద్రం అప్రమత్తమైంది. అక్కడ ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక విమానాల్లో భారతీయులను ఉక్రెయిన్ తరలించనున్నారు. ఎయిర్ ఇండియా తొలి ప్రత్యేక విమానం డ్రీమ్ లైనర్ బీ-787 ఉక్రెయిన్ కు బయల్దేరింది. 200లకు పైగా సీటీంగ్ కెపాసిటీ ఉన్న ఈ విమానం ఉక్రెయిన్ నుంచి నేడు ఢిల్లీకి రానుంది.

మరోవైపు ఉక్రెయిన్ లోని దొనెట్స్క్, లుహాన్స్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్టు రష్యా ప్రకటించడంతో ఆంక్షల దిశగా బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమణ మొదలైందని బ్రిటన్ మంత్రి సాజిద్ చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వారందరినీ ఆంక్షల పరిధిలోకి తెస్తామని తెలిపారు. రష్యాకు చెందిన కంపెనీలు, సంస్థలు డాలర్లు, బ్రిటిషన్ పౌండ్లు వాడకుండా నిషేధిస్తామని ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ ప్రకటించారు.







మరింత సమాచారం తెలుసుకోండి: